మగువ.. మగువ..
లోకానికి తెలుసా, నీ విలువ..
మగువ.. మగువ..
నీ సహనానికి సరిహద్దులు కలవా..
అటు ఇటు అన్నింటా..
నువ్వే జగమంతా.
పరుగులు తీస్తావు ,
ఇంటా బయటా..
అలుపని రవ్వంత,
అననే అనవంట..
వెలుగులు పుస్తావు, వెళ్లే దారంతా….
స..
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
మగువ.. మగువ..
లోకానికి తెలుసా, నీ విలువ..
మగువ.. మగువ..
నీ సహనానికి సరిహద్దులు కలవా…
నీ కాటుక కనులు విప్పారక పోతే
ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చెయ్యి, కదలాడకపోతే
ఏ మనుగడ కొనసాగదు గా..
ప్రతి వరస లోను ప్రేమగా
అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ
అంచనాల కందున
ఆలయాలు కోరని
ఆది శక్తి రూపమా
నీవులేని జగతిలో
దీపమే వెలుగున
నీడగు లాలనాలో
ప్రియమగు పాలనలో
ప్రతి ఒక మగవాడు
పసి వాడేగా
ఎందరి పెద వులలో
ఏ చిరునవ్వు న్నా
ఆ సిరి మెరుపు లకు
మూలం నీవే గా….
స..
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
మగువ.. మగువ..
లోకానికి తెలుసా, నీ విలువ..
మగువ.. మగువ..
నీ సహనానికి సరిహద్దులు కలవా..
స..
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
గమప మగస గమప మగస
గమప మగ గమప మగ గమని క మస
No comments:
Post a Comment