Sunday, 23 April 2023

శంకరా..నాదశరీరా పరా song lyrics - Shankarabharanam

 

https://en.m.wikipedia.org/wiki/Sankarabharanam_(1980_film)

శంకరాభరణం : శంకరా..నాదశరీరా పరా


Movie       : Shankarabharanam(శంకరాభరణం)(1981)

Cast      : Somayajulu, Manjubhargavi, Tulasi, Raja Lakshmi, Vara Lakshmi, Chandra Mohan, Nirmalamma, Allu Ramalingayya

Music     : K.V Mahadevan

Director   : K Viswanathan

Song Lyric  : Shankara nadasarera para

Singer    :

Lyricist           : Veturi Sundarama Murthy

Banner         : Poornodaya Movie Creations

Writters          : K. Viswanath, Jandhyala (dialogues)

Cinematography       : Balu Mahendra


శంకరా..నాదశరీరా పరా

వేదవిహారా హరా జీవేశ్వరా(2)


ప్రాణము నీవని గానమే నీదని

ప్రాణమే గానమని

మౌన విచక్షణ గాన విలక్షణ

రాగమే యోగమని(ప్రాణము)

నాదోపాసన చేసిన వాడను

నీ వాడను నేనైతే(౨)

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత

కందరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర

గానమిది అవధరించరా రా

విని తరించరా(శంకరా)


మెరిసే మెరుపులు మురిసే పెదవుల

చిరు చిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరి సరి నటనల

సిరి సిరి మువ్వలు కాబోలు(మెరిసే)

పరవశాన శిరసూగంగా

ధరకు జారెనా శివగంగ(2)

నా గాన లహరి నువ్వు మునుగంగా

ఆనంద వృష్టి నే తడవంగా(శంకరా)

శంకరా..నాదశరీరా పరా

వేదవిహారా హరా జీవేశ్వరా(2)


ప్రాణము నీవని గానమే నీదని

ప్రాణమే గానమని

మౌన విచక్షణ గాన విలక్షణ

రాగమే యోగమని(ప్రాణము)

నాదోపాసన చేసిన వాడను

నీ వాడను నేనైతే(౨)

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత

కందరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర

గానమిది అవధరించరా రా

విని తరించరా(శంకరా)


మెరిసే మెరుపులు మురిసే పెదవుల

చిరు చిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరి సరి నటనల

సిరి సిరి మువ్వలు కాబోలు(మెరిసే)

పరవశాన శిరసూగంగా

ధరకు జారెనా శివగంగ(2)

నా గాన లహరి నువ్వు మునుగంగా

ఆనంద వృష్టి నే తడవంగా(శంకరా)

https://en.m.wikipedia.org/wiki/Sankarabharanam_(1980_film)

Kondalalo Nelakonna song lyrics


 

రచన: అన్నమాచార్య

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడు వాడు ||

కుమ్మర దాసుడైన కురువరతి నంబి

ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |

దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి

రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ||

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి

ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |

మచ్చిక దొలక తిరునంబి తోడుత

నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-

ణించి తన యెడకు రప్పించిన వాడు |

యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు

మంచివాడై కరుణ బాలించిన వాడు ||

Chandra Sekhara Ashtakam - చంద్రశేఖరాష్టకం

 



చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.



రత్నసాను శరాసనం, రజతాద్రి శృంగ నికేతనం,


శింజనీ కృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్;


క్షిప్రదగ్దపురత్రయం, త్రిదివాలయై రభివందితం,


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః . ||1||



పంచపాదప పుష్ప గంధి పదాంభుజద్వయ శోభితం,


ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహమ్;


భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం, భవ మవ్యయం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||2||



మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం,


పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం;


దేవసింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||3||



యక్ష రాజ సఖం, భగాక్షహరం, భుజంగ విభూషణం,


శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్;


క్ష్వేలనీలగళం, పరశ్వధ ధారిణం, మృగ ధారిణం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||4||



కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం,


నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్;


అంధకాంత కమాశ్రితామర పాదపం, శమనాంతకం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||5||



భేషజం భవరోగిణాం, అఖిలాపదామపహారిణం,


దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం, త్రివిలోచనమ్;


భక్తిముక్తి ఫలప్రదం, సకలాఘ సంఘనిబర్హణం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||6||



భక్తవత్సల మర్చితం, నిధి మక్షయం, హరిదంబరం,


సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమమ్;


సోమవారిణ భూహుతాశన సోమపానిలఖాకృతం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్. ||7||



విశ్వసృష్టివిధాయినం, పునరేవ పాలన తత్పరం,


సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్;


క్రీడయంత మహర్నిశం, గణనాథయూథ సమన్వితం,


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్. ||8||



మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ,


యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్;


పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,


పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం,


చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.


చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.


చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః.||9||



||ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం సమాప్తం||

Saturday, 1 April 2023

నిలువెల్లా పురుడోసుకుని సాంగ్ తెలుగు లిరిక్స్

Niluvella Purudosukuni...

Matti song

Save Soil 

మట్టిని కాపాడుకుందాం..

నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది

చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది

పురుగు, పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడయినది

పసుల, పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది

వట్టి మట్టేగా అంటావేమో

మనుగడ పుట్టేది గిట్టేది

మట్టిలోనే కదరా

మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం

అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం

మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం

నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది

చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది


దేశమంటే మట్టేనోయ్

మట్టి లేకుంటే మనిషిెక్కడోయ్

సారం లేని మట్టిలో

నువ్వు సాగెట్ల సాగిస్తావోయ్

సాగుంటేనే సౌభాగ్యం

లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం

తిండి, బట్ట, నీడకి

నిండు మట్టే రా మూలాధారం


వట్టి మట్టేగా అంటావేమో

మనుగడ పుట్టేది గిట్టేది

మట్టిలోనే కదరా 


మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం

అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం


మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం

మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం

అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం


మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం


నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది

చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది