Sunday, 23 April 2023

శంకరా..నాదశరీరా పరా song lyrics - Shankarabharanam

 

https://en.m.wikipedia.org/wiki/Sankarabharanam_(1980_film)

శంకరాభరణం : శంకరా..నాదశరీరా పరా


Movie       : Shankarabharanam(శంకరాభరణం)(1981)

Cast      : Somayajulu, Manjubhargavi, Tulasi, Raja Lakshmi, Vara Lakshmi, Chandra Mohan, Nirmalamma, Allu Ramalingayya

Music     : K.V Mahadevan

Director   : K Viswanathan

Song Lyric  : Shankara nadasarera para

Singer    :

Lyricist           : Veturi Sundarama Murthy

Banner         : Poornodaya Movie Creations

Writters          : K. Viswanath, Jandhyala (dialogues)

Cinematography       : Balu Mahendra


శంకరా..నాదశరీరా పరా

వేదవిహారా హరా జీవేశ్వరా(2)


ప్రాణము నీవని గానమే నీదని

ప్రాణమే గానమని

మౌన విచక్షణ గాన విలక్షణ

రాగమే యోగమని(ప్రాణము)

నాదోపాసన చేసిన వాడను

నీ వాడను నేనైతే(౨)

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత

కందరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర

గానమిది అవధరించరా రా

విని తరించరా(శంకరా)


మెరిసే మెరుపులు మురిసే పెదవుల

చిరు చిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరి సరి నటనల

సిరి సిరి మువ్వలు కాబోలు(మెరిసే)

పరవశాన శిరసూగంగా

ధరకు జారెనా శివగంగ(2)

నా గాన లహరి నువ్వు మునుగంగా

ఆనంద వృష్టి నే తడవంగా(శంకరా)

శంకరా..నాదశరీరా పరా

వేదవిహారా హరా జీవేశ్వరా(2)


ప్రాణము నీవని గానమే నీదని

ప్రాణమే గానమని

మౌన విచక్షణ గాన విలక్షణ

రాగమే యోగమని(ప్రాణము)

నాదోపాసన చేసిన వాడను

నీ వాడను నేనైతే(౨)

దిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత

కందరా నీలకంధరా

క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్ర

గానమిది అవధరించరా రా

విని తరించరా(శంకరా)


మెరిసే మెరుపులు మురిసే పెదవుల

చిరు చిరు నవ్వులు కాబోలు

ఉరిమే ఉరుములు సరి సరి నటనల

సిరి సిరి మువ్వలు కాబోలు(మెరిసే)

పరవశాన శిరసూగంగా

ధరకు జారెనా శివగంగ(2)

నా గాన లహరి నువ్వు మునుగంగా

ఆనంద వృష్టి నే తడవంగా(శంకరా)

https://en.m.wikipedia.org/wiki/Sankarabharanam_(1980_film)

No comments:

Post a Comment