Niluvella Purudosukuni...
Matti song
Save Soil
మట్టిని కాపాడుకుందాం..
నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది
చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది
పురుగు, పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడయినది
పసుల, పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది
వట్టి మట్టేగా అంటావేమో
మనుగడ పుట్టేది గిట్టేది
మట్టిలోనే కదరా
మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం
అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం
మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం
నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది
చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది
దేశమంటే మట్టేనోయ్
మట్టి లేకుంటే మనిషిెక్కడోయ్
సారం లేని మట్టిలో
నువ్వు సాగెట్ల సాగిస్తావోయ్
సాగుంటేనే సౌభాగ్యం
లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం
తిండి, బట్ట, నీడకి
నిండు మట్టే రా మూలాధారం
వట్టి మట్టేగా అంటావేమో
మనుగడ పుట్టేది గిట్టేది
మట్టిలోనే కదరా
మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం
అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం
మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం
మట్టే రా పుట్టుకకు ఆధారం, మోసేది నీ భారం
అన్నమయ్యి ఆకలి తీర్చే మమకారం
మట్టేరా ప్రాణమున్న బంగారం, జీవకోఠికి గర్భం వట్టిపోనియ్యకు నేలను తీర్చుకో ఋణం
నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మ పసిరి పైరులు కన్నది
చెట్టు చేమల పుట్టలతో జీవుల మనుగడకు అనువయినది
No comments:
Post a Comment