Saturday, 6 May 2023

నా హృదయంలో నిదురించే చెలి song lyrics - Aaradhana

 https://en.wikipedia.org/wiki/Aradhana_(1962_film)

నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి
అనుసరించినానే కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి

నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే
పల్లవిగా పలుకరించ రావే
నీ వెచ్చని నీడ వెలసెను
నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను
నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి

No comments:

Post a Comment