Saturday, 6 May 2023

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో song lyrics - Amarasilpi Jakkamma


https://www.youtube.com/watch?v=lDdy981zs0g

 

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో song lyrics - Amarasilpi Jakkamma
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao

Singer: Ghantasala

ఓహో ఓ ఓ
ఓహోహో ఓ ఓ
ఓహోహో ఓ ఓ
ఓ ఓ

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ ఓ ఓ
ఈ నల్లని రాలలో

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని రాలలో

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని రాలలో

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ ఓ ఓ
ఈ నల్లని రాలలో

https://en.wikipedia.org/wiki/Amarasilpi_Jakkanna

No comments:

Post a Comment