Sunday, 14 May 2023

Dulquer Salmaan and Venky Atluri to join hands for Sithara Entertainments’ next

 

Dulquer Salmaan and Venky Atluri to join hands for Sithara Entertainments’ next 


Dulquer Salmaan, the Malayalam young star, has grown leaps and bounds in other languages as well. Whenever he acts in any language, he has a knack to present himself as a person hailing from that culture and land, seemlessly. 


The actor is going to be part of young sensational blockbuster director, Venky Atluri. After Sir/Vaathi, the director is joining his hands with Sithara Entertainments and Fortune Four Cinemas for this cinema. Presented by Srikara Studios.


Sithara Entertainments and Fortune Four Cinemas have been producing films with quality and content at their behest. They want to produce films that entertain and remain with audiences over time. 


This film will also be another quality and content oriented film that will entertain every audience member without fail. 


This exciting combination is going to start shooting from October, 2023, aiming for a Summer, 2024 release. More details will be announced soon.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తదుపరి చిత్రం కోసం చేతులు కలిపిన దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి 


మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అతను ఏ భాషలో నటించినా, అక్కడి సంస్కృతికి తగ్గట్లుగా తనను తాను మలచుకొని, ఆ మట్టిలో పుట్టిన వ్యక్తిగానే అందరికీ చేరువ అవుతారు.


తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరైన దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కోసం యువ సంచలనం, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలుపుతున్నారు. సార్/వాతి తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ నిర్మాణంలో సినిమా చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి అత్యుత్తమ నాణ్యత, కంటెంట్‌తో కూడిన అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నాయి. వినోదాన్ని అందించడంతో పాటు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రాలను అందించడానికి వారు కృషి చేస్తున్నారు.


ఈ చిత్రం కూడా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరించే మరో క్వాలిటీ మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అవుతుంది.


అద్భుతమైన కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ 2023, అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Sunday, 7 May 2023

వాడవాడల వెంట వాడివో వాడివో song lyrics - Yesudas



వాడవాడల వెంట వాడివో వాడివో

నీడనుండి చీరలమ్మే నేతబేహారి



పంచభూతములనెడి పలువన్నెనూలు

చంచలపుగంజి వోసి/తోడ చరినేసి

కొంచెపు కండెల నూలిగుణముల నేసి

మంచి మంచి చీరలమ్మే మారుబేహారి



మటమాయముల దనమగువ పసిడినీరు

చిటిపొటియలుకల జిలికించగా

కుటిలంపుజేతలు కుచ్చులుగా గట్టి

పటవాళి చీరలమ్మే బలుబేహారి



మచ్చిక కర్మమనేటి/జీవులపెద్ద మైల సంతలలోన

వెచ్చపు కర్మధనము విలువచేసి

పచ్చడాలుగాగుట్టి బలువేంకటపతి

ఇచ్చకొలదుల నమ్మేయింటిబేహారి

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది - M.Balamuralikrishna


Audio link : G.BalaKrishnaPrasad
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ || మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ | విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ || చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా | అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

Jagadapu Chanuvula Jaajara - జగడపు చనువుల జాజర song lyrics - Annamayya

 


జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర


మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున

జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర


భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి

చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర


బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము

వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర





Saturday, 6 May 2023

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో Subhalekha Rasukunna song lyrics - Kondaveeti Donga

 


Directed : A. Kodandarami Reddy

Produced : T Trivikrama Rao

Starring : Chiranjeevi,Sharada,Vijayashanti,Radha,Rao Gopal Rao,Mohan Babu,Amrish Puri

Music    : Illayaraja

Cinematography: V S R Swamy

Release  : March 09, 1990

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

అది నీకు పంపుకున్నా అపుడే కలలో

పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో

ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో

తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో

శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో

శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో


చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి

కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి

మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి

మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి

మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులు

గుచ్చీ గుచ్చీ కౌగిలించే నచ్చే వన్నెలు

అంతేలే కథంతేలే అదంతేలే

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో

తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో

పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో

ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో


హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో

రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో

వేసవల్లె వేచి ఉన్నా వేణు పూల తోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు

ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలు

అంతేలే కథంతేలే అదంతేలే

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

అది నీకు పంపుకున్నా అపుడే కలలో

శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో

శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా song lyrics - Anarkali

Starring : Akkineni Nageswara Rao, Anjali Devi

Director :   Vedantam Raghavaiah

Music Director : Adinarayana Rao P.

Producer : Anjali Devi


మదన మనోహర సుందరనారి

మధుర ధరస్మిత నయనచకోరి

మందగమన జిత రాజమరాళి

నాట్యమయూరి... అనార్కలి అనార్కలి అనార్కలి


ఆ... ఆ... ఆ...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా... రాజశేఖరా...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా రాజశేఖరా


మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా

మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా

మధురమైన బాధరా, మరపు రాదు. ఆ...

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏలరా రాజశేఖరా


కానిదాన కానురా, కనులనైన కానరా

కానిదాన కానురా, కనులనైన కానరా

జాగుసేయనేలరా, వేగరావదేలరా

జాగుసేయనేలరా, వేగరావదేలరా

చేర రారా చేర రారా చేర రారా 


రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో song lyrics - Amarasilpi Jakkamma


https://www.youtube.com/watch?v=lDdy981zs0g

 

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో song lyrics - Amarasilpi Jakkamma
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao

Singer: Ghantasala

ఓహో ఓ ఓ
ఓహోహో ఓ ఓ
ఓహోహో ఓ ఓ
ఓ ఓ

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ ఓ ఓ
ఈ నల్లని రాలలో

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని రాలలో

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని రాలలో

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ ఓ ఓ
ఈ నల్లని రాలలో

https://en.wikipedia.org/wiki/Amarasilpi_Jakkanna

అయ్యయ్యో బ్రహ్మయ్యా song lyrics - Adrushta Vanthulu


అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా యా యా


అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా యా యాఅయ్యయ్యో బ్రహ్మయ్యా


చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు

పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు

చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు

పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు

బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు

బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు

కొంత కోడెతనముంది మరి కొంత ఆడతనముంది


హోయ్ అయ్యయ్యో బ్రహ్మయ్యా

అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా యా యాఅయ్యయ్యో బ్రహ్మయ్యా


మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు

బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు

హాయ్మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు

బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు

ఆ కసరు లోనే అలకనవ్వుల విసురు లేక పోలేదు

కొంత చిలిపితనముంది మరి కొంత కలికితనముంది

హోయ్ అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా యా యాఅయ్యయ్యో బ్రహ్మయ్యా


బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే

కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే

బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే

కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే

కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా

కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా

కవ్వించే కౌగిలిలో కరగించక వదిలేరా

హోయ్ అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా

ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా

అయా యా యాఅయ్యయ్యో బ్రహ్మయ్యా

https://en.wikipedia.org/wiki/Adrushtavanthulu

నా హృదయంలో నిదురించే చెలి song lyrics - Aaradhana

 https://en.wikipedia.org/wiki/Aradhana_(1962_film)

నా హృదయంలో నిదురించే చెలి

కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి
అనుసరించినానే కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి

నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించ రావే
పల్లవిగా పలుకరించ రావే
నీ వెచ్చని నీడ వెలసెను
నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను
నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి
ఎదురు చూచినానే నిదుర కాచినానే

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలి