ఉల్లిపాయలు… వీటిని మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఘాటైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయలను తరిగితే కళ్లవెంట నీళ్లు రాలిపడతాయి. చాలా మందికి తెలియని విషయం ఆ ఉల్లిపాయతో మనకు ఎన్నో లాభాలున్నాయి. నిత్యం వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అందులో ఒకటైన ఉల్లిపాయలను చక్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
* పెద్దగా ఉండే ఉల్లిపాయలను చక్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధరించి నిద్రించాలి. ఉదయాన్నే తీసేయాలి.
* కాళ్లు మృదువుగా మారతాయి. కాళ్లకు ఉండే పగుళ్లు పోతాయి.
* రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరంలో ఉండే నీరంతా బయటికి పోతుంది.
* ఉల్లిపాయలను కాళ్ల కింద పెట్టుకోవడమే కాదు. ఆ చక్రాలను వాసన చూసినట్టయితే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది.
* పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయలలో ఉన్నాయి.
* చర్మంపై ఉల్లిపాయ చక్రాలను రాస్తుంటే మచ్చలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.
* ఉల్లిపాయ రసాన్ని తలకు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుకలు కూడా మళ్లీ పెరుగుతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలు కాంతివంతమవుతాయి.
* ఉల్లిపాయలను పచ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.
* ఉల్లిపాయలను కట్ చేసి వాటి వాసన పీలుస్తుంటే జలుబు కూడా తగ్గుముఖం పడుతుంది.
* బెణుకులు, కండరాల నొప్పులను ఉల్లిపాయలు తగ్గిస్తాయి.
* ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటికి చక్కెరను కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాసి బ్యాండేజ్‌తో కవర్ చేయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది.
* ఉల్లిపాయలను మెత్తని పేస్ట్‌లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
No comments:
Post a Comment