నేతన్నల సత్యాగ్రహానికి సంఘీభావం తెలిపేందుకు సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని బైబిల్ మిషన్ ప్రాంతానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సాదర స్వాగతం లభించింది. చేనేతల సమస్యలపై గళం ఎత్తుతూ, తాను ఏం చేయబోయేదీ పవన్ స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణకు సంకేతాలు అందించారు. ప్రజలతో మమేకమైనవారే కావాలంటూ పార్టీలోకి ఆహ్వానించారు. నిమ్మరసం ఇచ్చిన చే‘నేత’లను దీక్ష విరమింపజేశారు.
భారీ బందోబస్తు.. హాయ్‌లాండ్, కాజ టోల్‌గేటు నుంచి విశ్వవిద్యాలయం, చేనేత గర్జన సభ వద్ద ఉదయం నుంచి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సత్యాగ్రహం విజయవంతం కావటంతో పద్మశాలీ సాధికారిత సంఘం రాష్ట్ర నేతలు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏ.ఎన్.మూర్తి, వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారపు శ్రీనివాసరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, జగ్గారపు సాంబశివరావు, దివిరాము, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చేనేత ప్రదర్శన
చేనేత ఐక్యగర్జన సభ, చేనేత సత్యాగ్రహం వద్ద చేనేత వస్తు, వృత్తుల ప్రదర్శన నిర్వహించారు. చేనేత మగ్గంపై వస్త్ర ఉత్పత్తి, చేనేత పడుగుల సాగు, ఇతర అనుబంధ వృత్తుల ప్రదర్శన సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.
చేనేత ఐక్యగర్జన సభ, చేనేత సత్యాగ్రహం వద్ద చేనేత వస్తు, వృత్తుల ప్రదర్శన నిర్వహించారు. చేనేత మగ్గంపై వస్త్ర ఉత్పత్తి, చేనేత పడుగుల సాగు, ఇతర అనుబంధ వృత్తుల ప్రదర్శన సభకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.
No comments:
Post a Comment