Sunday, 19 February 2017

Telugu songs lyrics - శివాని.. భవాని.. శర్వాణి.. Shivani Bhavani song lyrics

శివాని.. భవాని.. శర్వాణి..
గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని... నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చరణం 1 :
శృంగారం తరంగించు... సౌందర్యలహరివని ...
శృంగారం తరంగించు.. సౌందర్యలహరివని ...
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని...
శాంతం మూర్తీభవించు.. శివానందలహరివని...
కరుణ జిలుగు సిరినగవుల కనకధారవీవని ..
నీ దరహాసమే దాసుల దరి చేర్చే దారియని ..
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చరణం 2 :
రౌద్రవీర.. రసోద్రిక్త ... భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి.. అభయపాళి నీవని
సమమ మగమ మదద దమగ దసని సరిససస
సనిసనిదని దపదప మప మపదాని మపగరిస
గా గా గ గ గా గా గ గ రిగరిసాని సని సరిగరిగ
భీభత్సానల కీలవు.. భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివని...
అద్భుతమౌ.. అతులితమౌ.. లీల జూపినావని
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని.. నీ సుతుడనే శివాని
శివాని.. భవాని.. శర్వాణి..
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : వాణీజయరాం

No comments:

Post a Comment