Sunday, 11 December 2016

25 thousand limit credit card on SBI - ఎస్.బి.ఐ ద్వారా... ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ పెద్ద శుభవార్తే



ఎస్.బి.ఐ ద్వారా... ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ పెద్ద శుభవార్తే

డబ్బులు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థితి. డబ్బులన్నీ బ్యాంకుల్లో ఉండిపోయి తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్లినా కావాల్సింది డబ్బులే అందులోనూ చిల్లర కోసం ఎదుర్కొంటున్న దుస్థితి అంతా ఇంతా కాదు. వీటన్నింటి గురించి అందరికీ తెలిసిందే... అయితే ఇకనుంచి ఈ పరిస్థితి నుంచి బయటపడేందు మరో అవకాశం అందించనుంది ఎస్.బి.ఐ ద్వారా... ఇది కచ్చితంగా ప్రతి ఒక్కరికీ పెద్ద శుభవార్తే.
నోట్ల రీప్లేస్ మెంట్ తర్వాత కార్డుల వినియోగం అధికంగా పెరిగిన విషయం తెలిసిందే.. అలాగే డిజిటల్ ఇండియాను చేసే ప్రక్రియలో భాగంగా ఇదికూడా కచ్చితంగా ఉపయోగపడనుంది.
ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులు అందరికీ లభించే అవకాశం లేదు.. కానీ ఇక నుంచి ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఎటువంటి బ్యాంకు కాతా వివరాలు, సంపాదన వివరాలు అందించకుండానే క్రెడిట్ కార్డును పొందే అవకాశం ఎస్ బి ఐ కల్పించింది. అయితే కాతాలో కొంత డబ్బును ఎప్పటికీ నిల్వఉంచితే చాలు...

1 comment: