Tuesday, 27 December 2016

Padimandilo Pata Padina Telugu Song Lyrics

Padimandilo Pata Padina Telugu Song Lyrics - పదిమందిలో పాటపాడినా..



పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!

చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......

చిత్రం : ఆనంద నిలయం (1971)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర

1 comment: