తెలంగాణలో వజ్రాలపై పూర్తిస్థాయిలో సర్వే....
గతంలో గనుల శాఖ పాత మహబూబ్నగర్-నల్గొండ జిల్లాల పరిధిలోని తూర్పు ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో చెప్పుకోదగ్గ వజ్రాల నిక్షేపాలున్నాయి. వీటితోపాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనూ నిక్షేపాలను కనుగొన్నారు. ఈ ప్రాంతంలో సహజసిద్ధమైన కింబర్లైట్ రాయి కనిపించినట్లు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే..
తెలంగాణలో వజ్రాల నిక్షేపాలున్నట్లు కొన్నేండ్ల క్రితమే గుర్తించినా... ప్రస్తుతం పూర్తిస్థాయి సర్వే జరపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం ఆమోదముద్ర వేయగానే పూర్తిస్థాయి సర్వే చేయడానికి రాష్ట్ర గనుల శాఖ అడుగులు వేస్తోంది.
No comments:
Post a Comment