Sunday, 4 December 2016

"పెద్ద నోట్ల రద్దు.... చిల్లర కష్టాలు... " - నల్లధనంపై మోడీ మళ్ల యుద్ధం

2000 - రెండు వేలు ఈ పదం ఇప్పుడు దేశంలో పలకని మనిషి లేడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన వెయ్యి ఐదు వందల నోట్ల రద్దుతో భారతదేశంలోని ప్రతి ఒక్కరు ఈ విషయాన్నే గత నెల రోజులుగా మాట్లాడుకుంటున్నారు.
రద్దు చేసారు అయిపోయింది... కానీ ఇప్పుడు "పెద్ద నోట్ల రద్దు.... చిల్లర కష్టాలు... " అలా వచ్చి ఇలా పోయేటివి కావు....  ఇంకా కొంత కాలం అంటే కొంత కాలమే కాదు చాల నెలల వరకు ఉండవచ్చు కూడా. దేశంలో ఎక్కడైన సరే ఇదే పరిస్థితి. తీవ్ర కష్టాలనే  ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దు పెద్దోళ్ళకు సమస్య కానేకాదని చెప్పాలి. చిరు వ్యాపారులకు, సామాన్య జనానికి, రోజు కూలీలకు, మధ్య తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
రోజు రెండు వేల తీసుకోవడానికి బ్యాంకుల ముందు ఐదు ఆరు గంటలు నిలబడితే అదీ చివరకు చేతికి రావచ్చు రాకపోవచ్చు.. నల్లధనంపై మోడీ మళ్ల యుద్ధం ప్రకటించినా ప్రస్తుతం సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రతిఒక్కరికి తెలిసిందే. ధనవంతులకు  మాత్రం ఇటువంటి కష్టాలు లేవనే చెప్పాలి.
కొన్ని నెలలపాటు ఇటువంటి కష్టాలు ఎన్ని పడ్డా ఆ తరువాత ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా నోట్ల రద్దు దేశాన్ని మరింత అభివృద్ధి పథం లో నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు

No comments:

Post a Comment