Sunday, 11 December 2016

Niti Aayog plans Rs 1 crore prize for e-payments - ఇక డిజిటల్ పేమెంట్స్ లక్ష్యం.. లక్కీ విన్నర్ కు కోటి రూపాయల ప్రైజ్ మనీ...



ఇక డిజిటల్ పేమెంట్స్ లక్ష్యం.. లక్కీ విన్నర్ కు కోటి రూపాయల ప్రైజ్ మనీ...

దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాత నోట్ల రద్దు చేసి కోత్త నోట్ల విడుదల చేసిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. దేశ ప్రజలను అభివ్రుద్దిపథంలో నడిపించేందుకుగాను డిజిటల్ పేమేంట్స్ వైపు మళ్లించే ప్రయత్నంలో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టబోతోంది. నీతి యోగ్ కింద రాబోతున్న పథకంకోసం నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కి రూ. 125 కోట్ల ప్రత్యేక నిధిని ఇవ్వనున్నారు.  అయితే దీనికి ప‌ది ప్రమోట‌ర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, కెన‌రా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, సిటిబ్యాంక్‌, హెచ్ఎస్‌బీసీ ఈ ప్రమోట‌ర్ల లిస్ట్‌లో ఉన్నాయి.
ఈ నెల చివ‌రిక‌ల్లా ఈ స్కీమ్ ప్రారంభం కానున్న ఈ స్కీమ్ లో పీవోఎస్ మెషిన్లు వాడుతున్న‌వారినీ ప‌రిశీలిస్తారు.  ఈ స్కీమ్ ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా కొనసాగనుంది. డిజిటల్ పేమెంట్స్ చేసిన వారిలో ట్రాన్సక్షన్ ఐడిలను ఎంపిక చేసి పది మంది కస్టమర్లకు, పది మంది వ్యాపారస్తులకు వారానికి ఒకసారి జరిగే డ్రా లో పది లక్షలు... మూడు నెలలకోసారి ఎంపిక చేసే లక్కీ డ్రాలో  కోటి రూపాయలు బహుమతిగా అందించనున్నారు.

No comments:

Post a Comment